Vinayakan : ఆ విషయం పై వస్తున్న రూమర్స్ ని ఖండించిన జైలర్ నటుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జైలర్ మూవీ 2023లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ యాక్టర్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు..’జైలర్’లో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించారు. ఆయన కుమారుడిగా ‘అశ్విన్స్’ ఫేమ్ వసంత్ రవి, కోడలిగా మిర్నా మీనన్, బ్లాస్ట్ మోహన్ పాత్రలో సునీల్, కీలక పాత్రలో తమన్నా తదితరులు నటించారు. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
జైలర్’ సినిమా విడుదలైన తర్వాత ఇంత భారీ విజయం సాధిస్తుందని, వసూళ్ళ సునామీ సృష్టిస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు.స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రీ రికార్డింగ్ చేయక ముందు సినిమా చూసి యావరేజ్ అనుకున్నానని సక్సెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. ‘జైలర్’ సక్సెస్ తర్వాత చిత్ర నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన సూపర్ స్టార్ రజనితో పాటు దర్శకుడు దిలీప్ నెల్సన్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తదితరులకు ఖరీదైన కార్లను బహుమతులుగా ఇచ్చారు.
అంతే కాకుండా లాభాల్లో కొంత షేర్ ను కూడా ఇచ్చారని, ముందుగా అనుకున్న పారితోషికం కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారని సమాచారం.’జైలర్’ సినిమాలో మెయిన్ విలన్ రోల్ చేసిన వినాయకన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక మలయాళీ. అయితే… తమిళ సినిమాలు కూడా చేశారు. తెలుగులో ‘పొగరు’గా విడుదలైన విశాల్ ‘తిమిరు’ ఆయనకు తమిళంలో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించారు. దాదాపు పదేళ్ళ విరామం తర్వాత ‘జైలర్’తో మళ్ళీ కోలీవుడ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు. ‘జైలర్’లో వినాయకన్ పాత్ర ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అయితే అంత అద్భుతంగా నటించిన వినాయకన్ కు రెమ్యూనరేషన్ పరంగా అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.’జైలర్’కు గాను ఆయనకు కేవలం 35 లక్షల రూపాయల పారితోషికం మాత్రమే అందిందని ఒక వార్త వైరల్ అవుతుంది.. దానిని వినాయకన్ ఖండించారు.’జైలర్’కు తాను కేవలం 35 లక్షల రూపాయలే అందుకున్నట్లు వచ్చిన వార్తలను వినాయకన్ కొట్టి పారేశారు. ”నాకు 35 లక్షలు ఇచ్చారనేది ఒట్టి పుకారు మాత్రమే. మా నిర్మాత కళానిధి మారన్ చెవిలో ఈ మాటలు పడలేదని నేను ఆశిస్తున్నా. ప్రచారంలో ఉన్న పారితోషికం కంటే మూడు రేట్లు ఎక్కువగానే నాకు అందింది. నేను అడిగిన మొత్తం నాకు ఇచ్చారు. చిత్రీకరణలో నన్ను ఎంతో మర్యాదగా చూసుకున్నారు” అని వినాయకన్ పేర్కొన్నారు
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!