ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాలసముద్రంలోని ఏకాశీల పార్క్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అమలుకు నోచుకోని దొంగ హామీలను ఇచ్చారన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలను చెప్పి ఏవి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను రద్దు చేస్తూ.. గత ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Errabelli Dayakar Rao : ఆరు గ్యారంటీల పథకాల అమలు పార్లమెంటు ఎన్నికల కోసమే
గత ప్రభుత్వం గతంలో అక్టోబర్ నెలలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీమును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎల్లారీస్ రెగ్యులేషన్ ఉచితంగా చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. కానీ.. ఈరోజు మాట మార్చి 20,44,000 మంది అప్లై చేసుకుంటే పేద, మధ్యతరగతి వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఖజానాన్ని నింపే విధంగా, 20 కోట్ల ఆదాయం వచ్చేలాగా పేద,మధ్య తరగతి ప్రజల పైన భారాన్ని మోపుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రజల పక్షాన నిలబడాలని ఈరోజు అన్ని నియోజకవర్గాలలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పారని, అందులోని భాగంగానే కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యానవనం ముందర ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు వినయ్ భాస్కర్.
PM Modi: మోడీని కలిసిన సందేశ్‌ఖాలీ బాధిత మహిళలు