Site icon NTV Telugu

Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

Anganwadi Teacher

Anganwadi Teacher

సంగారెడ్డి జిల్లా కంగ్టి( మం)రాసోల్ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌ వసంత కుమారిని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టారు గ్రామస్తులు. జుట్టు కత్తిరించి గాడిదాపై ఉరేగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వద్దని ప్రాధేయపడ్డా కూడా కనికరించకుండా గ్రామస్తులు దారుణంగా వ్యవహరించారు. గంటకు పైగా అంగన్ వాడీ టీచర్ ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపారు. దీనికి గల కారణం ఏంటంటే.. అంగన్ వాడీ టీచర్ భర్త ఇన్సూరెన్స్ డబ్బులను గ్రామస్థుల నుంచి వసూలు చేసి తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. భర్తపై ఉన్న కోపంతో సంబంధం లేని మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version