Site icon NTV Telugu

Fake News : విక్రమ్ చనిపోయాడంటూ ప్రచారం.. కాదంటున్న కుటుంబ సభ్యులు

Vikram Gokhale

Vikram Gokhale

Fake News : సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సినీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు బాలీవుడ్ సీనియర్ నటుడు, మరాఠీ స్టేజ్, సినిమా, టీవీ నటుడు విక్రమ్ గోఖలే మరణించినట్టు ఈ తెల్లవారుజాము నుంచీ వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం కూడా తెలిపారు. కానీ ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలు చనిపోక ముందే చంపేయడం ఇటీవల ఎక్కువైపోయింది.

Read Also: Shocking : మహారాష్ట్రలో దారుణం.. నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు

కాగా గోఖలే చనిపోయినట్టు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. తానింకా బతికే ఉన్నాడని కాకపోతే ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని, ఆయన కోసం ప్రార్థించాలంటూ గోఖలే కుమార్తె కోరారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రముఖ మరాఠీ థియేటర్, సినిమా ఆర్టిస్ట్ చంద్రకాంత్ గోఖలే కుమారుడైన విక్రమ్ గోఖలే.. సంజయ్ లీలా బన్సాలీ రొమాంటిక్ మూవీ ‘హమ్ దిల్‌దే చుకే సనమ్ (1999), కమల హాసన్ సినిమా ‘హే రామ్’, ‘భూల్ భులైయా’ (2007), ‘దే దనాదన్ (2009) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

Exit mobile version