Site icon NTV Telugu

Vikarabad: దారుణం.. ప్రియుడు మోసం చేశాడని పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య..

Love Couple Suicide

Love Couple Suicide

వికారాబాద్ జిల్లా దోమ మండలం పీర్లగుట్ట తాండాలో విషాదం నెలకొంది. తనను ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన నేనావత్ లక్ష్మి (19) అనే యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుల్కచర్ల మండలం గోన్యా నాయక్ తండాకు చెందిన రాహుల్ తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని… ఇప్పుడు పెళ్ళికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ.. తన ఆత్మహత్యకు రాహుల్ కారణమంటూ లక్ష్మి వాంగ్మూలంలో తెలిపింది. అంతేకాకుండా తన వద్దనున్న మూడు తులాల బంగారం, రూ. 20 వేల నగదు తీసుకుని ముఖం చాటేశాడని పేర్కొంది. పెళ్ళి విషయం అడగగా కుల గోత్రాలు కలవవని పెళ్ళి కుదరదని చెప్పాడని యువతి తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించారు. రాహుల్‌ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టనున్నారు.

READ MORE: Tech Tips : మీ IRCTC పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా..? సింపుల్ 5 స్టెప్స్‌తో రీసెట్ చేయండిలా..!

Exit mobile version