వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఓ సెలూన్ షాప్ యజమాని విన్నుతన నిరసన చేపట్టాడు. రోడ్డు పనుల వల్ల తనకు వ్యాపారం జరగడం లేదంటూ.. రోడ్డు మధ్యన నీటిలో కుర్చీ వేసుకొని కూర్చుని నిరసన తెలిపాడు. రోడ్డు మధ్యలో కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు మధ్య నుంచి లేవాలని స్థానికులు, అధికారులు ఆడినా అతడు ససేమిరా అన్నాడు. రోడ్డు పనుల వల్ల తనకు తీవ్ర నష్టం జరుగుతోందని, తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Diwali 2025 Festival Date: కన్‌ఫ్యూజన్‌లో జనాలు.. దీపావళి పండగ ఏ తేదీనో తెలుసా?
బషీరాబాద్ జీవన్ గి మీదుగా కరణ్ కోట్ వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పనులు జరుగుతున్న క్రమంలో పైప్ లైన్ పగిలి.. రోడ్డుపై నీరు నిలిపోయింది. నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రోడ్డుపై నీరు నిలిచిపోవడం వల్ల తన షాప్‌కు కస్టమర్లు రావడం లేదంటూ ఓ సెల్యూన్ యజమాని నిరసన వ్యక్తం చేశాడు. రోడ్డుపై ఉన్న నీటిలో కుర్చీ వేసుకుని కూర్చుని వాహనాలు వెళ్లకుండా అడ్డగించాడు. కాంట్రాక్టర్ రోడ్డుకు మరమ్మత్తులు త్వరగా చేయకపోవడంతోనే తన వ్యాపారం దెబ్బతింటుందని చిరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు వచ్చి బెదిరించినా అతడు వెనక్కి తగ్గలేదు. తనకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.
