NTV Telugu Site icon

Betting : పావురాలతో ఆ పని చేస్తూ పట్టుబడ్డ కేటుగాళ్లు

Betting

Betting

Betting : వికారాబాద్ జిల్లా పరిగి లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అయితే.. ముందు పావురాలతో వైరస్‌ను వ్యాపించేందుకు ప్లాన్‌ చేశారనే అనుమానంతో స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో.. వాళ్లు స్థానికులతో బేరసారాలకు దిగారు. దీంతో పావురాల బెట్టింగ్‌ కథ బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో పావురాలను తెచ్చి పందెం నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా 20 బాక్సులలో సుమారు 300 పావురాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

Game Changer : “డాకు మహారాజ్” ట్రైలర్ కోసం రంగంలోకి “గేమ్ ఛేంజర్” ఎడిటర్

40 పావురాలను ఆకాశంలోకి వదిలి పందెం పెట్టుకున్న వ్యక్తులను నిలదీశారు స్థానికులు.. దీంతో.. ముందు పావురాలకు ట్రైనింగ్ ఇస్తున్నామని బకాయించగా.. పోలీసులకు సమాచారం ఇవ్వకండి అంటూ.. స్థానికులతో బేరసారాలు జరిపారు. అనుమానం వచ్చి పోలీసులకు తెలిపారు స్థానికులు. దీంతో రంగలోకి దిగిన పోలీసుల బెట్టింగ్‌ రాయుళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పావురాల బెట్టింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. పావురాల బాక్సులపై కోడ్ నంబర్లు.. పావురాల కాళ్లకు కోడ్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరింతం సమాచారం కోసం పావురాల బాక్సులను ఆటోలో తీసుకువచ్చిన మునావర్, బూబు జానీ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.. మునావర్, బాబు జానీలు సత్యసాయి జిల్లా గోరిట్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ పావురాలు సుమారు 300 కి.మీ ప్రయాణం చేస్తాయంటున్నారు పావురాల ట్రైనర్, మునావర్.

Donald Trump: హష్ మనీ కేసులో జనవరి 10న కోర్టుకు ట్రంప్.. శిక్ష విధిస్తామని తెలిపిన కోర్టు

Show comments