Site icon NTV Telugu

Vikarabad: లక్కంటే వీళ్లదే..! గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్‌పాట్..

Telangana Panchayat Elections

Telangana Panchayat Elections

Vikarabad: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్‌పాట్ తగిలింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మతన్ గౌడ్ గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎస్టీ రిజర్వేషన్‌ ఖరారైంది. గ్రామంలో ST కుటుంబం ఒక్కటే ఉండటంతో ఆ కుటుంబానికి జాక్‌పాట్ తగిలింది. గ్రామంలో 494 మంది ఓటర్లు 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలో ఎరుకలి భీమప్పకు అవకాశం దక్కడంతో వారి ఆనందానికి అవధులే వేరు.. ఎరుకల భీమప్ప, భార్య వెంకటమ్మ గ్రామంలో చీపుర్లు, బుట్టలు అల్లి జీవనం సాగిస్తున్నారు.. భీమాప్పకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఎల్లప్ప, మహేష్ కోడళ్ళు సప్న, సుజాత.. వీరు నగరంలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు.. సర్పంచీ పదవితో పాటు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ రెండు వార్డుల స్థానాలు కూడా ఆ కుటుంబానికే దక్కబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వారి కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నాయని గ్రామంలో చర్చ నడుస్తోంది. ఈ ఆసక్తికరమైన విషయం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది..

READ MORE: Keerthy Suresh: ప్లాప్స్ పరంపరకు కీర్తి సురేష్ చెక్ పెట్టేనా?.. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఊపిరిపోస్తుందా?

Exit mobile version