Site icon NTV Telugu

Vikarabad: భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన భర్త.. ఉరిశిక్ష విధించిన కోర్టు..

Court

Court

Vikarabad Murder Case: వికారాబాద్ పట్టణంలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన భర్తకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల సమాచార ప్రకారం.. 32 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్.. వికారాబాద్‌లోని నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్ల కిందట వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తన భార్య చాందినీపై దాడికి పాల్పడ్డాడు. భార్యతో ఘర్షణ సందర్భంగా మొదట ఇనుప రాడ్డుతో ఆమెను, ఐదేళ్ల కుమార్తె ఇన్జిల్‌ను బలంగా కొట్టి హతమార్చాడు. అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడి అయాన్‌ను గొంతు నులిమి చంపాడు. అయితే.. ప్రవీణ్‌కుమార్ చాందినీని రెండో వివాహం చేసుకున్నాడు. కుమారుడి అయాన్‌ చాందినీకి మొదటి భర్త సంతానం. చిన్నారి మాత్రం నిందితుడు ప్రవీణ్ కుమార్తె.

READ MORE: SKN : మహేశ్ బాబు అభిమాని కుటుంబానికి నిర్మాత భారీ సాయం

అయితే.. తన భార్యపై మొదట అనుమానం వ్యక్తం చేసిన భర్త.. భార్య మొబైల్‌లో సందేశాలు చూసిన తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తరచూ మద్యం తాగి వాదనలు పెడుతుండేవాడని దర్యాప్తులో బయటపడింది. హత్యల అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పటికీ, చివరికి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితుడిని రిమాండ్‌కు పంపారు. నేరం తీవ్రత, ఆధారాలను పరిశీలించిన వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

READ MORE: India Russia Relations: భారత్-రష్యాపై అమెరికాతో సహా పాశ్చాత్య దేశాల ఒత్తిడి..! తగ్గేదేలే అంటున్న ఇరు దేశాలు..?

Exit mobile version