Site icon NTV Telugu

Karur Stampede: నా గుండె నొప్పితో తల్లడిల్లుతోంది.. తొక్కిసలాటలో 41 మంది మృతి తర్వాత విజయ్ వీడియో విడుదల

Vijay

Vijay

తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్‌ ప్రచార సభలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దేశంలో సంచలనంగా మారింది. తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై దర్యప్తుకు ఆదేశించింది. కాగా ఇప్పటికే విజయ్ మృతులకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Also Read:Nani – Sujeeth Movie: నాచురల్ స్టార్‌తో సుజిత్ సినిమా.. ముహూర్తం ఎప్పుడో తెలుసా..

తాజాగా విజయ్ తొక్కిసలాట ఘటనపై వీడియో విడుదల చేశారు. నా గుండె నొప్పితో తల్లడిల్లుతోందంటూ వీడియోలో పేర్కొన్నారు. తొక్కిసలాటలో 41 మంది మరణించిన రెండు రోజుల తర్వాత, మంగళవారం సాయంత్రం నటుడు విజయ్ ఒక విషాదకరమైన సందేశాన్ని విడుదల చేశారు. “నా జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు… నా శరీరం, మనస్సు ఆందోళనతో నిండిపోయాయి. నా హృదయం బాధతో నిండిపోయింది” అని విజయ్ తెలిపారు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. త్వరలోనే నిజం బయటపడుతుందని తెలిపారు.

ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందన్నారు. సూమారు ఐదు నిమిషాల విడియో విడుదల చేశారు. ఎంతో ప్రేమతో నా మీటింగ్‌కు ప్రజలు వచ్చారన్నారు. సీఎం సర్, మీకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, నామీదా మీకు నచ్చింది చేయండని అన్నారు. నేను ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటానని తెలిపారు. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. నేను మనిషినే అంతమంది చనిపోయి బాధపడుతుంటే నేను వెళ్ళిపోతానా? మళ్ళీ ఇబ్బంది వస్తుందని నేను ప్రజలను కలవడానికి కరూర్ వెళ్ళలేదని తెలిపారు.

Exit mobile version