Mushrooms Sales: పుట్టగొడుగులకు భారీ డిమాండ్.. ఒక్క కట్ట రూ.500.. అయినా జోరుగా విక్రయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ నగరంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో నాటు పుట్టగొడుగులకు (మష్రూమ్) విపరీతమైన డిమాండ్ నెలకొంది. సాధారణంగా వర్షాకాలంలో నెల రోజుల పాటు మాత్రమే లభించే ఈ సహజ పుట్టగొడుగులను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ.. కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి నాటు పుట్టగొడుగులను తీసుకొచ్చి విజయవాడలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క కట్ట పుట్టగొడుగును రూ.500కు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ రుచి తెలిసిన వినియోగదారులు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు.
నాటు పుట్టగొడుగులకు ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. సూపర్ మార్కెట్లలో లభించే సాధారణ మష్రూమ్‌లతో పోలిస్తే.. సహజంగా అడవులు, పొలాల్లో పెరిగే నాటు పుట్టగొడుగుల రుచి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ధరలు ఎక్కువగా ఉండటంతో కొంతమంది వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతుండగా.. మరికొందరు మాత్రం ‘రుచి కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం’ అంటూ కొనుగోలు చేస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే లభించే అరుదైన ఆహార పదార్థం కావడంతో ప్రతి ఏడాది ఈ సమయంలో నాటు పుట్టగొడుగులకు భారీ గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడ మార్కెట్లో మష్రూమ్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!