YSRCP: విజయవాడలో టీడీపీకి మరో షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు.
Read Also: CM YS Jagan: రేపు దెందులూరుకు సీఎం జగన్.. సిద్ధం సభకు సర్వం సిద్ధం
ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వారు వైసీపీ పార్టీలో చేరారు. తిరువూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కూడా కేశినేని నాని బాటలోనే వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా విజయవాడకే చెందిన మరో సీనియర్ నేత వెంకట రమణ టీడీపీని వీడి.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.