Site icon NTV Telugu

Vijayawada Police: బెజవాడలో తొలిసారి మహిళకు నగర బహిష్కరణ శిక్ష

Lady Vja

Lady Vja

విజయవాడ పోలీసులు నేరస్థుల పాలిట సింహ స్వప్నంలా మారుతున్నారు. తొలిసారి ఓ మహిళను నగర బహిష్కరణ శిక్ష వేశారు బెజవాడ పోలీసులు.బెజవాడలో తొలిసారిగా ఓ లేడీ కిలాడీకి నగర బహిష్కరణ శిక్ష విధించడం హాట్ టాపిక్ అవుతోంది. ఫోటోలో ఉన్న మహిళ పేరు సారమ్మ అలియాస్‌ శారద. పేరు సాఫ్ట్‌గానే ఉన్నా ఈవిడ మాత్రం ఖతర్నాక్. పోలీసుల కళ్లుగప్పి దందాలు చేయడంలో దిట్ట. ఇప్పటికే సారమ్మపై అజిత్‌సింగ్‌ నగర్‌ పీఎస్‌లో 13 కేసులున్నాయి. గంజాయి అమ్మడం మొదలు చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది. ఈమెపై పోలీసులు నిఘా పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఆమెలో మార్పు రాలేదు.

Read Also: Margani Bharat Ram: లోకేష్ పాదయాత్రతో ఉపయోగం లేదు

ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు పెట్టినా తీరు మారకపోవడంతో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. కఠిన శిక్షకు సిద్ధం అయ్యారు. సారమ్మ అలియాస్‌ శారదకు చివరికి నగర బహిష్కరణే మార్గమని భావించిన పోలీసులు అదే నిర్ణయాన్ని అమలు చేశారు. ఈమెతోపాటు 19 మందిని సిటీ నుంచి బహిష్కరించారు. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ఈ నగర బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు. మరోసారి వీళ్లు గంజాయి కేసుల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ క్రాంతి రాణా టాటా వార్నింగ్‌ ఇచ్చారు. నగర బహిష్కరణకు గురైన వారిలో సారమ్మ అనే మహిళ ఉండడం.. తొలిసారిగా ఓ మహిళపై సీరియస్‌ యాక్షన్‌ ఉండడం చర్చనీయాంశమైంది. ఇలాంటి శిక్షల వల్లనైనా నేరస్తుల్లో మార్పులు వస్తాయేమో చూడాలి.

Read Also: Kiara Advani: పెళ్లి తరువాత కియారా న్యూడ్ ఫోటో.. బయటపడింది ఇలా

Exit mobile version