Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vijayawada Police Has Made A Major Breakthrough In The Case Of Stone Attack On Cm Ys Jagan

Stone pelting attack on YS Jagan Case: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో కీలక పురోగతి

Published Date :April 16, 2024 , 10:17 pm
By Sudhakar Ravula
Stone pelting attack on YS Jagan Case: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో కీలక పురోగతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Stone pelting attack on YS Jagan Case: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జరిగిన రాయి దాడి ఘటనలో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. కేసు విచారణ నిమిత్తం 8 బృందాలు 48 గంటలు పనిచేయగా.. కీలక ఆధారాలను గుర్తించినట్టు తెలిసింది. సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ లో వైఎస్‌ జగన్ పై ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటలు దాటిన తర్వాత రాయితో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుపాపపైన గాయమైంది. అదే సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం సిట్ ను ఏర్పాటు చేశారు.

ఇక, ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, పబ్లిక్ తీసిన వీడియోలు, ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా ఒక కీలక బ్రేక్ త్రూ దొరికింది పోలీసులు.. స్థానికంగా నివసించే సత్తి అతని స్నేహితులకు సీఎం జగన్‌పై దాడితో సంబంధం ఉన్నట్టు ఆధారం దొరకటంతో ఆ ఐదుగురిని మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్తి మట్టి పనిచేసుకుంటాడు. వయస్సు 17 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సత్తిని మత్తు కోసం సొల్యూషన్ తాగుతున్నాడని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పి తీసుకెళ్ళారని సత్తి తల్లి రమణ చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా అక్కడ సత్తి అతని స్నేహితులు లేరని వారికి ఏమీ తెలియదని వదిలి పెట్టాలని సత్తి తల్లి కోరారు.

సీఎం వైఎస్‌ జగన్ పై వివేకానంద స్కూల్ దగ్గర నుంచి సత్తి దాడికి పాల్పడినట్టుగా పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అయితే, దాడి ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్భలంతో చేశారు అనే కారణాలపై పోలీసులు ఐదుగురిని విచారిస్తున్నట్టు సమాచారం. సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో వీరిని విచారిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు సేకరించిన సమాచారం, అనుమానితులు చెప్పే సమాచారాన్ని బేరీజు వేసి పక్కా ఆధారాలతో కేసు చేధించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. సీఎం జగన్ వంటి హైప్రొఫైల్ ఉన్ వ్యక్తిపై దాడి కావటంతో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే వివరాలు వెల్లడించే అవకాశలు ఉన్నట్టు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • police
  • Stone Attack on CM YS Jagan
  • Stone pelting attack on YS Jagan Case
  • vijayawada

తాజావార్తలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

  • Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions