NTV Telugu Site icon

Kanaka Durgamma: మహాలక్ష్మీ గా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

Sri Mahalakshmi Avatar

Sri Mahalakshmi Avatar

Kanaka Durgamma: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వైభవం కొనసాగుతోంది. ఇవాళ మహాలక్ష్మీ అవతారంలో దర్శనం ఇస్తున్నారు.. కనకదుర్గ అమ్మవారు. అమ్మలగన్న అమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ మహాలక్ష్మీ దేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం మధ్యరాత్రి నుంచి చదువుల తల్లి సరస్వతీదేవిగా అమ్మవారి దర్శనం ప్రారంభంకానుంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా.. మంచినీరు, పాలు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు ఆలయం అధికారులు..

Read Also: Honda vs Hero: హీరో మోటోకార్ప్‌కు షాకిచ్చిన హోండా!

మరోవైపు.. కనకదుర్గమ్మను మహాలక్ష్మీ అవతారంలో దర్శించుకున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు.. వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం అందజేశారు వేదపండితులు, ఆలయ అధికారులు.. ఇక, కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు దసరా ఉత్సవ ప్రధాన అధికారి రామచంద్ర మోహన్.. ఆలయంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు.. రామచంద్ర మోహన్ కు దసరా ఏర్పాట్లను వివరించారు కనకదుర్గ గుడి ఈవో రామారావు..

Show comments