Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Durga Temple: విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ఒక తీపి కబురు అందించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం దుర్గమ్మ ఆలయంలో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా లడ్డూ ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ నూతన విధానంలో భక్తులు ముందుగా ఆన్లైన్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ పూర్తి కాగానే భక్తుడి మొబైల్ ఫోన్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లి ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే నేరుగా లడ్డూ ప్రసాదం చేతికి అందుతుంది. ఈ మిషన్ల ద్వారా ఒక వ్యక్తి ఒక్కోసారికి ఒకటి నుంచి ఆరు లడ్డూల వరకు పొందే వెసులుబాటు ఉంటుంది. దసరా సమయానికి ఆలయంలో మొత్తం 6 ఏటీఎం మిషన్లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ సమయంలో దాదాపు 30 లక్షల నుండి 35 లక్షలకు పైగా లడ్డూ ప్రసాదం విక్రయాలు జరుగుతాయి. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో, రద్దీని నియంత్రించి ప్రసాద విక్రయాలను వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ ఏటీఎం విధానం ఎంతగానో తోడ్పడనుంది.
Also Read
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!