Site icon NTV Telugu

Indrakeeladri: విజయవాడ దుర్గమ్మ గుడిలో అపచారం ఘటన బాధ్యులకు నోటీసులు..

Durga

Durga

Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న అపచారం ఘటనపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అభిషేకానికి వినియోగించిన ఆవు పాలలో పురుగులు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో, స్టోర్, పూజల విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు సంబంధిత అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. విచారణలో అభిషేకానికి వాడిన బిందె పరిశుభ్రంగా లేకపోవడమే ఈ ఘటనకు కారణమని కమిటీ నిర్ధారించింది. పురుగులు ఉన్న బిందెలోనే పాలు పోసి అర్చకుడు అభిషేకం చేసినట్లు తేలింది.

Read Also: Shubman Gill: బౌలర్లకు అవకాశాలు.. శుభ్‌మన్ గిల్ ఏమ్మన్నాడంటే?

అయితే, ఈ ఘటనపై ఆలయ ఈవోకు కమిటీ నివేదికను సమర్పించింది. అలాగే, ఈ ఘటన గురించి ఆలయ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడం తప్పని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ విచారణలో స్టోర్, పూజల విభాగాల్లోని సిబ్బంది నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా బయటపడినట్లు పేర్కొంది. శ్రీచక్ర నవావరణార్చన నిర్వహించే అర్చకుడికి మెమో జారీ చేయడంతో పాటు అతడిని అంతర్గతంగా బదిలీ చేస్తూ పల్లకి సేవ, దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. స్టోర్, పూజల విభాగాల ఉద్యోగులు వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన

అలాగే, కమిటీ నివేదికను రెండు నుంచి మూడు రోజుల్లో దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆలయ ఈవో పంపనున్నారు. ఇకపై ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలు, పూజలకు తప్పనిసరిగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయాలకు కట్టుబడి, నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించాలని ఈవో స్పష్టం చేశారు.

Exit mobile version