Vijayawada Crime: విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. ఈ సంఘటన గురువారం ఉదయం సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. హత్యకు గురైన మహిళ సరస్వతీగా గుర్తించారు. ఆమె భర్త విజయ్ తో గత కొంతకాలంగా దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదు. తరచూ చిన్నచిన్న విషయాలపై ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని, ఇటీవల వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.
Vijay Devarakonda : వీలైనంత ఎంజాయ్ చేయండి.. విజయ్ కామెంట్స్ కు అర్థమేంటో
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయ్ కోపంతో భార్య ఉన్న చోటుకు వెళ్లి, కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో సరస్వతీ అక్కడికక్కడే మృతిచెందింది. హత్య అనంతరం కూడా విజయ్ కత్తితో వీరంగం సృష్టించాడని, స్థానికులు భయంతో దగ్గరికి రాలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. “ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తా” అంటూ విజయ్ కేకలు వేయడంతో ప్రాంతం మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తరువాత సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సూర్యారావు పేట పోలీసులు నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Mithun Reddy: చేసిన ఆరోపణలు నిరూపించండి.. డిప్యూటీ సీఎంపై ఎంపీ ఫైర్..!
