Site icon NTV Telugu

Vijayashanti : వాన‌పాముల ప‌ప్పు… పురుగుల అన్నం..

Vijayashanti

Vijayashanti

BJP Women Leader Vijayashanti Twits Against KCR Government.

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మళ్లీ నిరసన బాట పడుతున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీ నాణ్యమైన ఆహారం అందించడంలేదని, విద్యార్థులు అస్వస్థతలకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. తాజాగా ఆమె ట్వి్ట్టర్‌లో ‘ తెలంగాణలో విద్యా వ్య‌వ‌స్థ‌ను కేసీఆర్ స‌ర్కార్ తీవ్ర నిర్య‌క్ష్యం చేస్తోంది. ఇక గురుకులాల‌ను అయితే అస‌లే ప‌ట్టించుకోవ‌డంలేదు. బుక్కెడు బువ్వ కోసం గురుకులాల్లోని విద్యార్థులు తీవ్ర పోరాటమే చేయాల్సి వస్తోంది. ఒకచోట పాచిపోయిన కూర పెడుతున్నరు. మరోచోట పురుగుల అన్నం తినమంటున్నరు. తాజాగా పాలకూర పప్పులో ఏకంగా వానపామునే వడ్డించేశారు. ఫలితంగా, రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాల్లోని వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురై అస్పత్రుల పాలయ్యారు.

మన భావి పౌరులు కలుషిత ఆహారం తిని రోగాల బారిన పడుతూనే ఉన్నరు. గురుకులాలు తెరిచిన తర్వాత వరుసగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నయి. వారం రోజుల వ్యవధిలో ఎక్కడో ఒకచోట విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతూనే ఉన్నరు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లా మానుకోట గిరిజన బాలికల గురుకులంలో కలుషిత ఆహారం తిని 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు అందించిన పాలకూర పప్పులో వానపాములు ఉండటంతో ఆహారం కలుషితమై ఒక్కొక్కరుగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా ఇదే ప‌రిస్థితి. విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ విద్యార్థి లోకం తప్పక త‌గిన స‌మాధానం చెప్పి తీరుతుంది.’ అంటూ కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్టులు చేశారు.

 

Exit mobile version