NTV Telugu Site icon

MP Vijay Sai Reddy: ఏపీ అభివృద్ధిలో వెనుక పడిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు..

Mp Vijaya Sai

Mp Vijaya Sai

AP Development: ఈ నెల 10వ తేదీ మేదరమెట్ల సిద్ధం సభకు సర్వ సిద్దమైంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) అన్నారు. ఇదే ఆఖరి సిద్ధం సభ.. పొలిటికల్ క్యాంపెయిన్ లో మా ముఖ్యమంత్రి ( cm jagan ) ఈ ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరిస్తారు.. అలాగే, రాబోయే ఐదేళ్ళలో చేయబోయే కార్యక్రమాల మ్యానిఫెస్టోలో సీఎం వివరిస్తారు.. 100 ఎకరాల్లో సిద్ధం సభ.. అవసరమైతే మరో 100 ఎకరాలు సిద్ధం గా ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 20 ఎకరాల్లో పెట్టిన టీడీపీ, జనసేన సభకు లక్షల మంది వచ్చారు అని చెప్పుకున్నారు.. కానీ, మేము అలా చెప్పం.. బూత్ మేనేజ్మెంట్ పై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాం.. 2024 ఆ తర్వాత కూడా సీఎం జగన్ (cm jagan) ను ప్రాజెక్ట్ చేసుకుంటూ ఎన్నికలకు వెళ్తున్నాం.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం.. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు అభివృద్ధి ఫలాలు అందాయని విజయసాయి రెడ్డి తెలిపారు.

Read Also: Bengaluru Blast: పేలుడు తర్వాత దుస్తులు మార్చుకుని బస్సులో ప్రయాణించిన నిందితుడు..

అభివృద్ధి లేకుంటే తలసరి ఆదాయం పెరగదు అని ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) అన్నారు. తలసరి ఆదాయం, రాష్ట్ర స్తూల ఉత్పత్తి లో ఏపీ ముందుంది.. రామాయపట్నం పోర్టును సీఎం జగన్ ( cm jagan ) చేతుల మీదుగా శంఖుస్థాపన చేసి ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు.. ఏపీ అభివృద్ధిలో వెనుక పడిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. బీసీ డిక్లరేషన్ పై గతంలో చేసిన ప్రకటనలు చంద్రబాబు గుర్తు చేసుకోవాలి అని ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విషయంలో వైసీపీ విధానాలు దేశానికి ఆదర్శం.. 75 శాతం తగ్గకుండా ఆయా వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత వైసీపీకి దక్కుతుంది.. చంద్రబాబు ( chandrababu ) బీసీ డిక్లరేషన్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు.. నోటిఫికేషన్ తర్వాత వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది.. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Read Also: Actor Sivaji: వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. ?

మా టార్గెట్ 175 కు 175 స్థానాలు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) తెలిపారు. మాకు 175 స్థానాలు గెలుస్తామన్న నమ్మకం ఉంది.. గతంలో 10 లక్షలు టీడీపీ ( tdp ) చెప్పుకున్న సభకు 69 వేల మంది కూడా రాలేదు.. పొత్తు కోసం పాకులాడే పార్టీ టీడీపీ.. మేము ఎప్పుడు సింగిల్ గానే పోటీ చేస్తుంది.. ప్రభుత్వ పని తీరు, సీఎం ముఖాన్ని చూపించి ఓట్లు అడుగుతాం.. అభ్యర్థుల మార్పుల వల్ల మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు అని చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే లా అండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్ లో ఉంది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.