Site icon NTV Telugu

Vijayasai Reddy : చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు టీడీపీని దెబ్బతీస్తాయి

Vijayasai Reddy

Vijayasai Reddy

నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, ఎస్.సి.కమిషన్ మాజీ సభ్యుడు బద్దేపూడి రవీంద్రలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరుతున్నారన్నారు. జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు వస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ పై ఫిర్యాదులు చేయించి.. పింఛన్ దారులను చంద్రబాబు ఇబ్బందులకు గురి చేశారన్నారు. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు టీడీపీని దెబ్బతీస్తాయన్నారు విజయసాయిరెడ్డి. వాలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తోందని, వై.సి.పి.అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తామన్నారు. రేపు జగన్ బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతుందని ఆయన వెల్లడించారు.

రహదారి మార్గంలో వివిధ పాయింట్లు వద్ద ప్రజలు జగన్ కు స్వాగతం పలుకుతారని, అనంతరం కావలిలో జరిగే బహిరంగ సభ లో జగన్ పాల్గొంటారని ఆయ పేర్కొన్నారు. 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదులు చేసి.. పెన్షన్‌దారులకు వారిని దూరం చేయడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబళించి వేస్తున్నాయి. వాలంటీర్ మీద ఆధారపడిన ప్రతీ కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తామన్నారు.

Exit mobile version