Site icon NTV Telugu

Vijayasai Reddy: ఇస్రోకు దండిగా డబ్బులిచ్చి ప్రోత్సహించాలి

Vijaya Sai

Vijaya Sai

ఒక బ్లాక్‌బస్టర్‌ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్‌ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు దండిగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర సర్కార్ కు సూచించారు. అంతరిక్ష ప్రయోగాలలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన అన్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం కేవలం 2 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ మాత్రమే ఉంది.. అదే అమెరికాకు చెందిన నాసాకు 62 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ ఉంది.. ఇది ఇస్రో బడ్జెట్‌ కంటే 31 రెట్లు అధికంగా ఉందని విజయసాయి అన్నారు.

Read Also: Pomegranate Farming : ఈ పద్దతిలో దానిమ్మను సాగు చేస్తే లాభాలే లాభాలు..

భారత అంతరిక్ష ప్రయోగాలలో అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మంగళయాన్ మిషన్‌ అత్యంత తక్కువ వ్యయంతో పూర్తయింది అని విజయసాయిరెడ్డి అన్నారు. ఇంత తక్కువ వ్యయంతోనే ప్రపంచం అబ్బురపడే అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఇస్రోకు దండిగా నిధులు సమకూర్చితే ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో నిరూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేటాయించిన మొత్తంలో 8 శాతం కోత పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆక్షేపించారు. గత ఏడాది అంతరిక్ష రంగానికి బడ్జెట్‌ అంచనాలలో 13,700 కోట్ల రూపాయలు కేటాయించి సవరించిన అంచనాలలో దానిని 10,530 కోట్లకు కుదించారు. అంటే 23 శాతం నిధులకు కోత పెట్టారు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Read Also: Girlfriend Birth Day: యువకుడి ప్రాణాలు మీదికి తెచ్చిన గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే

ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న దేశాలతో పోల్చి చూసుకుంటే భారతదేశం ఎక్కడ ఉందో ఈ సందర్భంగా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇస్రో స్థాపనకు కేవలం నాలుగేళ్ళ ముందు ఏర్పాటైన నాసా ఇప్పటి వరకు వేయికి పైగా అంతరిక్ష ప్రయోగాలు చేపడితే ఇస్రో కేవలం 200 మిషన్లు మాత్రమే పూర్తి చేసిందన్నాడు. 2021లో చైనా 55 సార్లు అంతరిక్ష ప్రయోగాలు చేస్తే.. భారత్‌ కేవలం రెండు ప్రయోగాలు మాత్రమే చేసిందన్నాడు. అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తున్న ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మనం మరిన్ని మిషన్లు చేపట్టాలని అప్పుడే అంతరిక్ష వాణిజ్యంలో మన దేశం ముందు వరసలో నిలబడుతుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Harish Shankar: పవన్ డైరెక్టర్ కు సెటైర్ వేస్తే.. రిటైర్ అవ్వడమే.. ఇచ్చి పడేస్తాడు

అంతరిక్ష విజ్ఞానంలో ప్రతిభగల మానవ వనరుల అభివృద్ధి కోసం 2007లో తిరువనంతపురంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌టి) స్థాపన జరిగింది అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అయితే దేశీయంగా పెరుగుతున్న అంతరిక్ష కార్యక్రమాల అవసరాలకు తగినట్లుగా మానవ వనరులను సమకూర్చుకోవాలంటే ఇలాంటి సంస్థలు దేశంలో మరిన్నింటిని స్థాపించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. దేశంలో ఉద్యోగ అవకాశాలు లేక ప్రతి ఏటా వేలాది మంది ఇంజనీర్లు, సైంటిస్టులు.. వందలాది మంది ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకు పోతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ వలసలను నియంత్రించే చర్యలు చేపట్టాలని ఆయన ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version