పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా మెజారిటీ భాగం గ్రాఫిక్స్ తోనే ఉండబోతోందని సమాచారం.. నాగ్ అశ్విన్ అయితే ఈ చిత్రం కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు సమాచారం.అందుకే షూటింగ్ మొత్తం స్టూడియోలలో భారీ సెట్స్ వేసి మరీ చేస్తున్నారని సమాచారం.మెజారిటీ షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోందని సమాచారం.. చిత్రంలో అమితాబచ్చన్, దీపికా పదుకునే మరియు దిశాపటాని లాంటి బిగ్ స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు.. ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ ని సంప్రదిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.. భారీగా పారితోషకం ఇచ్చి మరీ ఈ మూవీలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఇక ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అందరూ కూడా అనుకుంటున్నారు..అధికారికంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే వైజయంతి మూవీస్ ప్రకటించింది.సుమారు 500 నుంచి 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో అశ్వనీదత్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని అందరూ కూడా భావిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నిర్మాణంలో ఏకంగా 6 మంది భాగస్వాములుగా ఉన్నారని సమాచారం.
ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో పాటు మరికొంత మంది ప్రాజెక్ట్ కె నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారని సమాచారం.ముఖ్యంగా డిస్టిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ ఈ సినిమా నిర్మాణంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది.. అయితే అఫీషియల్ గా వైజయంతీ బ్యానర్ అయిన కూడా నిర్మాణ భాగస్వాములుగా వారి పేర్లు ఉంటాయని సమాచారం.హాలీవుడ్ సినిమాలు కూడా ఎక్కువగా మల్టీపుల్ ప్రొడక్షన్ హౌస్ లు అన్నీ కలిసి సినిమాలను నిర్మిస్తూ ఉంటాయి. అలా నిర్మించడం వలన బడ్జెట్ షేరింగ్ జరిగి ఒకరి మీదనే సినిమా భారం అంతా పడకుండా ఉంటుంది. ఎప్పటి నుంచో హాలీవుడ్ మూవీస్ ఈ ఫార్మాట్ ని కొనసాగిస్తుంది.. తెలుగులో కూడా ఈ ట్రెండ్ మొదలైందని సమాచారం.అయితే చిన్న సినిమాలకు కూడా రెండు, మూడు ప్రొడక్షన్ హౌస్ లు కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.. అయితే మొదటిసారి ఓ పాన్ వరల్డ్ సినిమా కోసం ఆరుగురు ప్రొడ్యూసర్ లు కలిసి పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త నిజమో కాదో తెలియాల్సి ఉంది.