Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తన ప్రేమ విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించిన తమన్నా తన ప్రేమకు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతానికి తామిద్దరం పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ కూడా తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తమన్నా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మిల్కీబ్యూటీని చూసి తన డేటింగ్ రూల్స్ బ్రేక్ చేసినట్లు విజయ్ చెప్పుకొచ్చారు.
ఆయన మాట్లాడుతూ తాను కెరీర్ ప్రారంభించినప్పుడు మొదట్లో సినిమా పరిశ్రమ అంటే తనకు చాలా కోపం ఉండేదని తెలిపారు. అందుకే ఇండస్ట్రీకి చెందిన ఎవ్వరినీ ప్రేమించకూడదని రూల్ పెట్టుకున్నానని విజయ్ తెలిపాడు. తమన్నాను చూశాక తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలిపాడు. ఆమె తన ఆలోచనని మార్చేసిందని కితాబిచ్చాడు. ఇక తమన్నాకు యాక్టింగ్, బిజినెస్, అనేక ఆర్థికపరమైన అంశాలపై అవగాహన ఉందని తెలిపిన విజయ్ ఆమె దేనినైనా అన్ని కోణాల నుంచి ఆలోచిస్తుందని చెప్పారు. ఆమె ఆలోచన విధానం ఎంతో బాగుంటుందని ఆమె మంచితనం తనకు చాలా ఇష్టమని విజయ్ వెల్లడించారు. తమన్నా అన్ని విషయాలలో చాలా క్లియర్ గా ఉంటుందని, సరైన నిర్ణయం తీసుకుంటుందని కొనియాడాడు. తన అనుభవం, పనితీరు అమోఘమని చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ. ఒక్కోసారి తాను ఏదైనా విషయాన్ని పబ్లిక్ గా చెప్పినందుకు బాధపడుతూ ఉంటానని, ఆ సమయంలో తమన్నా వచ్చి తన బాధపోయేలా మాట్లాడి, తాను చేసింది కరెక్టే అనిపించేలా చేస్తుందని తన ప్రేయసిని ఆకాశానికి ఎత్తేశాడు విజయ్ వర్మ.
‘ ఇక ‘లస్ట్ స్టోరీస్-2’ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఈ జంట బహిరంగంగానే వెల్లడించింది. తాము ప్రేమను ఎంజాయ్ చేస్తున్నామని, తనని విజయ్ బాగా అర్థం చేసుకుంటాడని తమన్నా తెలిపింది. ఇక తాను సృష్టించుకున్న అందమైన ప్రపంచంలోకి తనని అర్థం చేసుకునే విజయ్ వచ్చాడని తమన్నా తన ప్రేమను చాలా సందర్భాల్లో వ్యక్తపరిచింది. ఇక తమన్నా తాజాగా తమన్నా తాజాగా ‘భోళా శంకర్’, ‘జైలర్’ సినిమాలో మెరిసింది. జైలర్ సినిమాలోని కావాలయ్యా పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. ప్రస్తుతం ఈ జంట సినిమాలతో బిజీగా ఉంది.