NTV Telugu Site icon

Vijay : కెరీర్లో భారీ రిస్క్ తీసుకుంటున్న విజయ్

Vijay

Vijay

Vijay : దళపతి విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించారు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీనిని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ని విస్తరించాలని అనుకుంటున్నారట. ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డుల వర్షం కురిపిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. లియో తర్వాత ఆయన ఓ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అందరినీ షాకింగ్ గురిచేసే నిర్ణయాన్ని విజయ్ తీసుకున్నారట. వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోలు తమ తదుపరి సినిమా భారీ హిట్ ఇచ్చే డైరెక్టర్ తో చేయాలని భావిస్తారు. కానీ విజయ్ ప్లాప్ డైరెక్టర్‎తో సినిమా చేయడానికి ఒకే చేశాడు. నిజానికి విజయ్‎తో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ఉత్సాహం చూపిస్తున్నా ఆయన వెంకట్ ప్రభుతో సినిమా చేయడానికి అంగీకరించడం విశేషం.

Read Also:Zomato: జొమాటో సీఓడీ ఆర్డర్లలో 70 శాతం రూ. 2000 నోట్లే.. విత్ డ్రా ఎఫెక్ట్..

వెంకట్ ప్రభు కెరీర్‎లో పెద్దగా ఆకట్టుకున్న సినిమాలు ఏమీ లేవనే చెప్పాలి. తాజాగా కస్టడీ సినిమాలను తెరకెక్కించాడు. వీటిలో మానాడు మ్యాన్ కథ తప్ప పెద్దగా ఆకట్టుకున్న సినిమాలు ఏవీ లేవు. తాజాగా విడుదలైన కస్టడీ సైతం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాంటి డైరెక్టర్‎తో విజయ్ సినిమా ఒకే చేశాడు అనగానే ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కేవలం విజయ్ స్టామినా మీదే సినిమా హిట్ ప్లాప్ మీద ఆధారపడి ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నిజానికి వెంకట్ ప్రభు ప్రాజెక్టులో యూనివర్సల్ అప్పీల్ లేకపోవడమే అతి పెద్ద లోపం. ఆయన కథలు బాగోవు అని చెప్పలేం. కానీ అందరికీ నచ్చవు. చాలా కొద్ది మందికి మాత్రమే నచ్చుతుంటాయి. అందుకే వెంకట్ ప్రభుతో సినిమా అనగానే ఫ్యాన్స్ భయపడుతున్నారు. విజయ్‎కి స్క్రిప్ట్ నచ్చే విధంగా చెప్పిన వెంకట్ ప్రభు సినిమా కూడా అలా అందరికీ నచ్చేలా తీస్తే బాగుండని కోరుకుంటున్నారు. మరి కొందరేమో విజయ్ తన కెరీర్‎లో అతిపెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:Ajith : అజిత్ కొత్త వ్యాపారం.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్

Show comments