Site icon NTV Telugu

Vijay Sethupathi : విజయ్ సేతుపతిలో ఈ టాలెంట్ కూడా ఉందా?

Vijay Sethupathi

Vijay Sethupathi

విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే.. తెలుగులో ఆయన సినిమాలు డబ్ అయ్యాయి.. దాంతో ఇక్కడ కూడా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు.. తమిళ్ స్టార్ హీరోలు పాటలు పాడతారు.. కమలహాసన్‌, విజయ్‌, శింబు, ధనుష్‌ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి.. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా తనలోని టాలెంట్ ను బయటపెట్టారు..

విజయ్‌సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన ‘కరా’ అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడారు. మాస్టర్‌ మహేంద్రన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కరా.. ఈ సినిమా సరికొత్త కథతో రాబోతుంది.. హీరో జీవా విలన్ గా చేస్తున్న ఈ సినిమాలో అయ్యనార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవానీ ఎంటర్‌ప్రైజస్‌ పతాకంపై రాజేంద్రకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవతార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అచ్చు రాజామణి సంగీతాన్ని అందిస్తున్నారు..

కరా సినిమాకు విజయ్‌సేతుపతి పాడిన కాదల్‌ కుమారు వైరల్‌ ఆనారు అనే పాటను ఇటీవల విడుదల చేయగా అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రేండింగ్‌ అవుతోందని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారు వరకూ ఆనందించే మంచి జనరంజకమైన సినిమాగా కథ ఉండబోతుంది.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సమ్మర్ కు విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.. ఆ పాటను మీరు ఒకసారి వినండి..

Exit mobile version