తానదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2 తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో స్లమ్ డాగ్ అనే సినిమా అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్ట్స్ సినిమాపై కోలీవుడ్ లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది.
Also Read : Asin : గజనీ సినిమా హీరోయిన్ ఆసిన్.. ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా?
తాజా సమాచారం ప్రకారం, విజయ్ సేతుపతి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కథను మణిరత్నం తొలుత సిలంబరాసన్ టీఆర్ శింబు కోసం రాసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల STR ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదట. దీంతో అదే కథకు విజయ్ సేతుపతిని హీరోగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. సహజమైన నటనకు పేరు తెచ్చుకున్న సాయి పల్లవి, సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం డైరెక్షన్, విజయ్ సేతుపతి లాంటి పవర్‌ఫుల్ నటుడు కలిసి చేసే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత విజయ్ సేతుపతి కెరీర్‌లో ఈ మణిరత్నం సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం సేతుపతి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
