Maharaja : కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం “మహారాజ”. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
Read Also:Vikarabad: మిస్టరీగా 4వ తరగతి విద్యార్థి మిస్సింగ్ ఘటన.. తొమ్మిది రోజులైనా దొరకని ఆచూకీ..
కాగా ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకోమని కోరగా ఆయన అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించారని సమాచారం. విడుదల నాటి నుండి సూపర్ హిట్ తో దూసుకు వెళ్లింది ఈ సినిమా. జూన్ 14న విడుదలైన ఈ సినిమా 50 రోజులు విజయవంతంగా ఆడింది. ఇటు తెలుగులోను మహారాజా సూపర్ హిట్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహారాజా 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
Read Also:Vikarabad: మిస్టరీగా 4వ తరగతి విద్యార్థి మిస్సింగ్ ఘటన.. తొమ్మిది రోజులైనా దొరకని ఆచూకీ..
మహారాజ సినిమా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా చైనాలో థియేట్రికల్ రిలీజ్ అయింది. అక్కడ నవంబర్ 29న రిలీజ్ అయి మంచి కలెక్షన్లను సాధిస్తోంది. అక్కడ ఏకంగా 40వేల స్క్రీన్స్ లో విడుదల చేయగా ఇపుడు ఈ సినిమాకు అక్కడ మంచి ఓపెనింగ్స్ దక్కినట్లు మేకర్స్ చెబుతున్నారు. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే అక్కడ ఈ సినిమాకి ప్రీమియర్స్ డే 1 కలిపి 1 మిలియన్ డాలర్లుకి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఒక సాలిడ్ ఓపెనింగ్ ని ఈ చిత్రం అందుకుందనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.