Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..!

77

77

విజయ్ దేవరకొండ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా భారత దేశ వ్యాప్తంగా తన స్టైల్ నటనతో పాటు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. దీంతో దేశవ్యాప్తంగా అనేకమంది అభిమానులు ఉన్నారు. మరికొందరు భక్తులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా విజయ్ దేవరకొండ అభిమాని ఒకరు తన శరీరంలోని రక్తంతో విజయ్ దేవరకొండ చిత్రాన్ని గీసి దానిని ఆయనకు బహుకరించాడు. అయితే ఈ సందర్భంలో జరిగిన సంభాషణలో భాగంగా.. మొదటగా విజయ్ దేవరకొండకు అభిమాని ఆ ఫోటోను ఇస్తుండగా అది మామూలుగా గీసిన చిత్రం అని భావించాడు. అయితే రక్తంతో గీసిన చిత్రమని తెలుసుకున్న తర్వాత.. తన అభిమానిని మళ్లీ వెనకలకు లాగి.. ‘బ్లడ్ ఆ.. అరే మెంటల్ ఇలాంటివి చేయొద్దు’ అంటూ అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read: Kethireddy Pedda Reddy: నిజమైన వైసీపీ కార్యకర్తలను డబ్బులతో కొనలేరు..

ఇక విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్, అలాగే అన్ని రకాల వర్గాలను టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ థియేటర్లలో రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో మొదలుపెట్టి పాటల దాకా అన్ని కుటుంబ ప్రేక్షకులకు సంబంధించి ఉండడంతో ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Also read: MS Dhoni E-Cycle: కొత్త ఈ-సైకిల్​ తో హల్చల్ చేస్తున్న ధోనీ.. మరి ఆ ఈ-సైకిల్ విశేషాలేంటంటే..?!

ఇదివరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటించిన గీత గోవిందం సినిమా లాగే.. విజయ్ కెరియర్ లో మరో బ్రేకింగ్ బ్లాస్టర్ రాబోతున్నట్లు అభిమానులు అనుకుంటున్నారు. సినిమాకి సంబంధించిన పాటలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.