Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Personal Life Controversy: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో, సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన భార్య సంగీతతో విభేదాలు, అలాగే హీరోయిన్ త్రిష కృష్ణన్‌తో సంబంధం ఉన్నట్టు వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల వెలువడుతున్న నివేదికల ప్రకారం, విజయ్ – సంగీత దాంపత్య జీవితంలో విభేదాలు నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 27 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ వివాహ బంధం ఇప్పుడు విరగబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని, పరస్పర ఆరోపణలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.
సంగీత, విజయ్‌పై వివాహేతర సంబంధం ఆరోపణలు చేయగా, తనపై మానసిక ఒత్తిడి కలిగించాడని ఆరోపించినట్టు సమాచారం. అయితే, ఈ ఆరోపణలపై విజయ్ లేదా ఆయన కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక, కొంతకాలంగా విజయ్ పేరు త్రిషాతో ముడిపడుతోంది. ఇద్దరూ కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘ఆతి’, ‘కురువి’, ‘లియో’ వంటి సినిమాల్లో వీరి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈ సంబంధంపై ఇద్దరూ ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. కొంతమంది ఈ వార్తలను ఖండిస్తుండగా, మరికొందరు ఇవి నిజమే కావచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. విజయ్-సంగీత ప్రేమ కథ కూడా అప్పట్లో ఎంతో ఆసక్తికరంగా నిలిచింది. 1999లో వీరు వివాహం చేసుకున్నారు. సంగీత విజయ్ అభిమానిగా లండన్ నుంచి వచ్చి కలిసిన తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. కానీ ఇప్పుడు అదే బంధం సంక్షోభంలో పడిందనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఎన్నికల తర్వాత విజయ్-త్రిషా వివాహం చేసుకుంటారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. మొత్తంగా, విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ తిరుగుతున్న ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవి కేవలం ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది. మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే రోజు ఉదయమే తిరుమల వచ్చి కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు త్రిష.. అయితే, విజయ్ గెలుపుకోసమే త్రిష తిరుమలకు వచ్చారనే ప్రచారం సాగుతోంది.. అయితే, ఈ రోజు త్రిష కృష్ణన్ పుట్టిన రోజు కావడంతోనే ఆమె తిరుమలకు వచ్చారని ఆమె ఫ్యాన్స్ చెబుతున్న మాట.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే మెజార్టీ స్థానాల్లో విజయం దిశగా అడుగువేస్తోన్న సమయంలో.. మరోసారి విజయ్ వ్యక్తిగత జీవితం తెరపైకి వచ్చింది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..