Site icon NTV Telugu

Jani Master: గిన్నిస్ రికార్డ్ విజేత విజయ్ కొనతాలకు ఘన సత్కారం.. జానీ మాస్టర్ ఎమోషనల్ స్పీచ్!

Vijay Konathala Guinness World Record, Jani Master

Vijay Konathala Guinness World Record, Jani Master

ప్రపంచ ప్రఖ్యాత యోగా డాన్స్ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ విజయ్ కొనతాలకు అరుదైన గౌరవం దక్కింది. ఫిల్మ్ డాన్సర్స్ అండ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజయ్‌ను స్వయంగా అభినందించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!

‘విజయ్ చాలా మంచి మనసున్న వ్యక్తి, కష్టపడే తత్వం ఉన్నవాడు. నేను హీరో నితిన్ నటించిన ‘ద్రోణ’ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా నా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు విజయ్ నాకు ఎంతో సహాయం చేశాడు. నా ఎదుగుదలలో, నా విజయాల్లో తన పాత్ర కూడా ఉంది. చైనాలో ఉన్నప్పటికీ మా మధ్య మంచి బంధం కొనసాగుతోంది. నా స్నేహితుడు గిన్నిస్ రికార్డ్ సాధించి మా అసోసియేషన్‌కు గౌరవం తీసుకురావడం గర్వంగా ఉంది’ అని తెలిపారు.

సత్కారం అందుకున్న అనంతరం విజయ్ కొనతాల మాట్లాడుతూ.. ‘నా డాన్స్ ఫ్యామిలీ నన్ను గుర్తించి గౌరవించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సత్కారం నాకు మరింత బాధ్యతను, కొత్త రికార్డులు సృష్టించాలనే ప్రేరణను ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, కమిటీ సభ్యులు పాల్గొని విజయ్‌ను ప్రశంసించారు.

Exit mobile version