Site icon NTV Telugu

Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..

Vijay Deverakonda Native Village Visit,

Vijay Deverakonda Native Village Visit,

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన మూలాలను ఎప్పటికీ మర్చిపోనని మరోసారి నిరూపించుకున్నారు. తన పెళ్లి తర్వాత మొదటిసారి భార్య రష్మిక మందన్నతో కలిసి తన స్వగ్రామమైన తుమ్మెన్‌పేటలో సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి, గ్రామస్థులందరికీ విందు ఏర్పాటు చేశారు. అక్కడ గ్రామస్థులతో మాట్లాడుతూ విజయ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.. ‘సొంతూరితో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవాలని మా నాన్న కల కనేవారు, ఆ కల ఇప్పుడు నెరవేరింది. నా పెళ్లి జరగడం, అదే సమయంలో ఇల్లు పూర్తికావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు..

Also Read : Tumbbad-2 :తుంబాడ్ 2 లో సెన్సేషనల్ యాక్టర్..

గ్రామ అభివృద్ధిపై తనకున్న విజన్‌ను పంచుకుంటూ.. ఇకపై ఊరికి రెగ్యులర్‌గా వస్తానని, తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిని కూడా గ్రామస్థులందరి సమక్షంలో ఇక్కడే ఘనంగా చేస్తానని మాటిచ్చారు. అలాగే సామాజిక బాధ్యతగా తన ‘దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్‌కు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెళ్లి తర్వాత తన సొంత ఊరికి ఇంతటి గొప్ప కానుకను అందించిన విజయ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘విరోష్’ (ViRosh) జంట మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం సిద్ధమవుతోంది.

Exit mobile version