Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

Vijay Deverakonda Fans Lunch,

Vijay Deverakonda Fans Lunch,

స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి, సామాన్యులతో మమేకమవడంలో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన పెళ్లి తర్వాత భార్య రష్మిక మందన్నతో కలిసి తన  అభిమానులుతో విందు ఆరగించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా  అందరితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘మా హీరో అంటే ఇదే.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే వీరే’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన సొంత ఊరి పట్ల తనకున్న ప్రేమే కాకుండా, తనను ఆదరించే అభిమానుల పట్ల ఉన్న గౌరవాన్ని విజయ్ ఈ విధంగా చాటుకున్నారు. ఈ పర్యటనలో విజయ్ ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జంట ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, సాయంత్రం జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.