Site icon NTV Telugu

Exclusive : మరక తొలగించుకునే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda

Vijay Deverakonda

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తో మంచి గుర్తింపు తెచ్చుకున్నఈహీరో అర్జున్ రెడ్డి తో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇక గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవి మనోడికి ఆ రేంజ్ సక్సెస్ ను ఇవ్వలేదు. డియర్ కామ్రేడ్ బాగున్నప్పటికి కమర్షియల్ గా నష్టాలు తెచ్చింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ లు ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్లు. ఈ సినిమాలు కమర్షియల్ గా డిజాస్టర్ కావడం కాదు విజయ్ నటన, డైలాగ్ డెలివరీపై దారుణమైన ట్రోలింగ్ తెచ్చిపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా గంగార్పణం అయింది.

అయితే విజయ్ మీద కామన్ ఆడియెన్స్ నుండి రెగ్యులర్ గా వచ్చే కంప్లైన్ట్ అతగాడి డైలాగ్ మాడ్యులేషన్. తెలంగాణ యాసను అవలీలగా మాట్లాడే విజయ్ ఇతర యాసలు మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ యాసలానే  పలుకుతాడు అనే మరక మనోడిపై ఉంది. లైగర్ లో విజయ్ నత్తితో మాట్లాడిన మాడ్యులేషన్ అయితే బాబోయ్ ఆపేండ్రోయ్ అనేలా నెత్తి బొప్పికట్టించాడు. ఫామిలీ స్టార్ వంటి అవుట్ రైట్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ ఇచ్చి ప్యాచ్ వర్క్ లు స్టార్ట్ చేసాడు. తన మీద మరక తొలగించుకునే యత్నం చేస్తున్నాడు.ఈ సారి రాబోయే సినిమా రౌడీ జనార్ధనలో గోదారి యాస ఉండబోతుంది. అలాగే టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సినిమాలో రాయలసీమయాస ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా ట్యూటర్లను కూడా నియమించుకున్నాడట. మొత్తానికి విజయ్ పాలిట మరక మంచిదయింది.

Exit mobile version