Site icon NTV Telugu

Vijay Deverakonda: నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి.. క్లారిటీ ఇచ్చిన హీరో..!

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ ఏప్రిల్‌లో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో మాట్లాడుతున్న విజయ్, కొన్ని వేల ఏళ్ల క్రితం ట్రైబ్స్ ఎలా కొట్టుకున్నారో.. ఇప్పుడు కూడా అంతే పరిస్థితి కొనసాగుతోంది అనే విధంగా అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ అప్పుడే పలువురు గిరిజన సంఘాలు స్పందించి ఆయనపై విమర్శలు గుప్పించాయి. ట్రైబల్స్‌ను ఉగ్రవాదులతో పోలుస్తారా? అని ప్రశ్నిస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Read Also: Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్..!

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “నాకు తెలిసి, నా మాటల వల్ల కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కానీ.. నేను ఎప్పుడూ ఏ తెగను, ఏ వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. భారతదేశ ప్రజలంతా ఒక్కటే అని నమ్మే మనిషిని. నేను మాట్లాడిన ట్రైబ్ అనే పదాన్ని వేరే అర్థంతో వాడాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరికైనా నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి. నేను శాంతి, ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను” అంటూ క్లారిటీ ఇస్తూ క్షమాపణలు తెలిపారు.

Read Also:Lopaliki Ra Chepta: ‘ లోపలికి రా చెప్తా’ అంటున్నారేంట్రా.. ట్రైలర్ రిలీజ్

అయితే, తాజాగా ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చిన గిరిజన సంఘాలు, విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాయి. రెట్రో ఈవెంట్‌ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు గిరిజనుల స్వాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ (SC/ST Atrocities) చట్టం కింద విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Exit mobile version