Site icon NTV Telugu

Vijay Deverakonda: దేవరకొండ మార్కు కామెంట్స్

Vijay Deverakonda Ed

Vijay Deverakonda Ed

Vijay Deverakonda: తెలుగు సినిమా పరిశ్రమలో ఆన్‌లైన్‌ దాడులు, రేటింగ్‌ల రచ్చ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమాకు సంక్రాంతి విడుదల సందర్భంగా బుక్ మై షోలో రేటింగ్‌లను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ కావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ దీనిపై తన మార్కు కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Anil Ravipudi: విజయ్ ‘జన నాయగన్‌’ సినిమాపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..

‘ఇది పరిశ్రమ కష్టానికి రక్షణ కవచమే అయినా, మనలోని విభేదాలు ఇలాంటి దాడులకు కారణమవుతున్నాయి’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సుదీర్ఘ పోస్ట్‌లో..’సినిమాలపై ఇలాంటి దాడులు పరిశ్రమ సహకార భావాన్ని దెబ్బతీస్తున్నాయి. 2019లో విడుదలైన తన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా నుంచే ఇలాంటి కోఆర్డినేటెడ్‌ బ్యాక్‌లాష్‌ను ఎదుర్కొన్నానని చెప్పారు. ‘ఆ సమయంలో మొదలైన ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు పెద్ద సినిమాలపై కూడా ఇది ప్రభావం చూపుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.

కోర్టు ఆదేశం అనేది సంక్రాంతి రిలీజ్‌లకు కొంత ఒత్తిడిని తగ్గిస్తుందని, అయితే ఇది సమస్యలను పూర్తిగా పరిష్కరించదని చెప్పారు. ‘లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌’ (బతకనివ్వు, బతకనిచ్చు) అనే సంస్కృతిని పరిశ్రమలో పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఆన్‌లైన్‌ సబోటేజ్‌ ఒక కొత్త సమస్య కాదు. గత కొన్నేళ్లుగా సినిమా విడుదల సమయంలో ఇలాంటి నెగెటివ్‌ రివ్యూలు, ఫేక్‌ రేటింగ్‌లు పెరిగిపోతున్నాయి. ఇవి సినిమా బాక్సాఫీస్‌ పనితీరును ప్రభావితం చేస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి దాడులను విజయ్‌ దేవరకొండ లాంటి యువ హీరోలు ఎన్నో ఎదుర్కొన్నారు. ఇప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్‌ సినిమాలకు కూడా ఇది వ్యాపించడం పరిశ్రమకు హెచ్చరిక గంటలా మోగుతోందని చెబుతున్నారు.

కోర్టు ఆదేశం ఒకవైపు సినిమా నిర్మాతలకు ఊరటనిస్తూనే, మరోవైపు పరిశ్రమలోని అంతర్గత విభేదాలను బయటపెడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ‘మనమంతా ఒకే ఫ్యామిలీ’ అనే భావనను బలోపేతం చేయాల్సిన సమయమిది అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్‌ దేవరకొండ పోస్ట్‌ సినిమా ప్రేమికుల్లో చర్చ రేపుతోంది.

READ ALSO: Iran Protests: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ఇజ్రాయిల్ హైఅలర్ట్..

Exit mobile version