Site icon NTV Telugu

Vijay Devarakonda : వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ న్యూ లుక్..

Whatsapp Image 2023 12 18 At 9.20.43 Pm

Whatsapp Image 2023 12 18 At 9.20.43 Pm

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెళ్లి చూపులు మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్‌ అయిన విజయ్ దేవరకొండ.ఆ తర్వాత అర్జున్‌ రెడ్డి సినిమాతో సూపర్‌ సక్సెస్ ను అందుకొని ఓవర్ నైట్ స్టార్ గా మారాడు.ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుససినిమాలతో బిజీగా ఉంటూనే బిజినెస్‌ లో కూడా తనదైన స్టైల్‌లో ముందుకెళ్తున్నాడు.విజయ్ దేవరకొండ లాంఛ్ చేసిన రౌడీ వేర్‌ (క్లాతింగ్‌ వేర్‌) ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇటీవలే RWDY Club కొత్తగా లాంఛ్ చేసిన స్ట్రీట్‌ కలెక్షన్‌లోవిజయ్ మెస్మరైజింగ్‌ లుక్‌లో మెరిశాడు. ఆరెంజ్ టీ షర్ట్‌ – బ్రౌన్‌ కార్గోస్‌ ప్యాంట్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ క్లీన్ అండ్‌ నీట్‌ లుక్‌తో కారులో కూర్చున్న ఫొటో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ నయా లుక్‌ చూసి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

ఈ ఏడాది ఖుషి మూవీ తో యావరేజ్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం డైరెక్షన్‌లో “ఫ్యామిలీ స్టార్‌”అనే సినిమా లో నటిస్తున్నాడు. VD13గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫ్యామిలీ స్టార్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించనుంది.ఈ చిత్ర గ్లింప్స్ వీడియో లో ఐరనే వంచాలా ఏంటీ..?విజయ్ దేవరకొండ మాస్ డైలాగ్స్ సినిమాపై సూపర్ బజ్ ని క్రియేట్ చేసాయి.ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తున్న 54వ సినిమా గా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ తెరకెక్కుతుంది.

https://twitter.com/GskMedia_PR/status/1736677739355308436

Exit mobile version