NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి లో విజయ్ దేవరకొండ క్యామియో రోల్ ..?

Vijay Devarakonda (1)

Vijay Devarakonda (1)

Kalki 2898 AD : ప్రభాస్ నటించిన కల్కి మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా  అని ఫ్యాన్స్ ,ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న రిలీజ్ చేస్తున్నారు.

Read Also :Devara : దేవర కోసం రంగంలోకి దిగిన ఆ స్టార్ కొరియోగ్రాఫర్‌..

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ ట్రైలర్ లోని విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వున్నాయి,దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సర్ప్రైసింగ్ క్యారెక్టర్స్ ను రివీల్ చేస్తూ రోజు రోజుకు ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అదిరిపోయే పాత్ర చేస్తున్నట్లు సమాచారం.అశ్వద్ధామ గా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ పై పోరాడే సన్నివేశాలలో నటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే విజయ్ పాత్ర గురించి మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.విజయ్ పాత్ర సస్పెన్సుతో కూడి ఉండాలని ఉద్దేశంతో ఎక్కడ కూడా ఆ పాత్ర లీక్ కాకుండా చూస్తున్నట్లు సమాచారం.

Show comments