VD 12 : రౌడీ భాయ్ సినిమా విషయంలో.. చివరి నిమిషం వరకు సస్పెన్స్ తప్పదా?
- గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12
- హిట్ కోసం పరితపిస్తున్న రౌడీ భాయ్
- విడుదల తేదీ విషయంలో వీడని సస్పెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VD 12 : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి, ఆయనుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం తాను హిట్ కోసం పరితపిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తను తదుపరి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత రావడం లేదు. టైటిల్‌ను ఇంకా రివీల్ చేయని మేకర్స్ విడుదల విషయంలోనూ అదే సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని.. మరో రెండు వారాల వర్కింగ్ డేస్‌తో షూటింగ్ పూర్తి కానుందంటూ ఇటీవల యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను 2025 వేసవికి విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ పట్టుదలతో ఉన్నాడు.
Read Also:ED Notices KTR: విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
VD 12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గతంలో మార్చి 28, 2025న విడుదల చేయాలని భావించారు. ఆ తేదీని ప్రకటించారు. కానీ సినిమా విడుదల తేదీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అదే సమయంలో మరో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక విడుదల తేదీ మార్చే అవకాశాలు లేకపోలేదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను మార్చి చివరి వారంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ సహకారం సైతం ఉంటుందంటూ యూనిట్ సభ్యుల సమాచారం.
Read Also:Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ఇన్ సైడ్ టాక్.. సోషల్ మీడియా షేక్
పవన్ మరో వారం రోజులు డేట్లు ఇస్తే హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేస్తామని దర్శకుడు జ్యోతి కృష్ణ చెబుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యింది. వచ్చే వారం లేదా ఆ తర్వాత వారంలో హరిహర వీరమల్లు నుంచి మొదటి పాట రాబోతుంది. సినిమా ప్రమోషన్ హడావిడి మొదలు పెట్టబోతున్నట్లుగా నిర్మాత ఏఎం రత్నం పేర్కొన్నారు. వీరమల్లు సినిమా ఇప్పటికే చాలా లేట్ అయింది. దాంతో ఆర్థిక భారం పెరిగిపోయింది. కనుక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విడుదల వాయిదా వేయకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు. కనుక హరిహర వీరమల్లు సినిమా విడుదల ఉంటే VD 12 సినిమా విడుదల కావడం తథ్యం. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న VD 12 సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తూ ఉండగా కీలక పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతుంది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమా హిట్ విజయ్ దేవరకొండుకు అత్యంత కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!