Site icon NTV Telugu

Vijay Devarakonda : అది నా పిల్ల.. ఇదొక ఎమోషన్

Whatsapp Image 2023 08 27 At 2.28.06 Pm

Whatsapp Image 2023 08 27 At 2.28.06 Pm

రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’.సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.సినిమా విడుదల దగ్గరపడటం తో ప్రస్తుతం మూవీ యూనిట్  ప్రమోషన్లతో బిజీ బిజీ గా ఉంటోంది. హీరోయిన్ సమంత అమెరికాలో ఖుషీ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. ఇటు విజయ్ దేవరకొండ కూడా సినిమాకు హైప్‎ను తీసుకువస్తున్నాడు.సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్‎లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా విజయ్ ఖుషిలోని తన డైలాగ్‎ను ఉద్దేశిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‎కు తన తమ్ముడు ఆనంద్ రిప్లై ఇచ్చాడు. దీంతో దేవరకొండ బ్రదర్స్ నెట్టింట్లో తెగ సందడి చేశారు.

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘ఖుషి’ ప్రచారంలో బాగా బిజీగా ఉన్నాడు. ఈ మూవీపైన నెటిజన్లు సరదాగా మీమ్స్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోలను క్రియేట్‌ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ మీమ్స్‎కు విజయ్ దేవరకొండ తనదైన స్టైల్‎లో స్పందించాడు. ఓ నెటిజన్‌ ‘ఖుషి’లో విజయ్‌ చెప్పే ‘అది నా పిల్ల’ డైలాగ్‌ను. ‘బేబీ’ లోని ఓ సన్నివేశంలో ‘అది నా పిల్లరా’ అంటూ ఆనంద్‌ దేవరకొండ ఎమోషనల్‎గా ఫీల్ అయ్యే సీన్‌ను యాడ్‌ చేసి ఒక ఫన్నీ వీడియో క్రియేట్ చేసాడు.”ఆకలేసిన వాడు ఒకరకంగా అంటాడు.. ఎదురుదెబ్బ తగిలినవాడు ఒకరకంగా అంటాడు” అని ‘కింగ్‌’ సినిమాలో కామెడీ స్టార్ బ్రహ్మానందం చెప్పే ఫన్నీ డైలాగ్‌‎ను ఈ సీన్స్‎లో మిక్స్‌ చేసి సరదాగా ఫన్నీ వీడియోను చేశాడు. ఈ వీడియోకు విజయ్‌ దేవరకొండ.. “అది నా పిల్ల.. ఇదొక ఎమోషన్‌” అని రిప్లై ఇచ్చాడు.అలాగే ఆనంద్‌ దేవరకొండ స్పందిస్తూ.. “ట్విటర్‌ అప్పుడప్పుడూ ఇలాంటి రత్నాలను బయటికి తీస్తుంది” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్‌ అవుతుంది.

https://twitter.com/TheDeverakonda/status/1695484576171491405?s=20

Exit mobile version