Site icon NTV Telugu

Vijay Devarakonda : సినిమాలు ఫుల్.. హిట్స్ నిల్.. ఈసారి హిట్ కొట్టకుంటే కష్టమే

Vijaydevarakonda

Vijaydevarakonda

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. ‘టాక్సీవాలా’ వంటి సక్సెస్ తర్వాత ఈ రౌడీ హీరోకి బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడలేదు. ‘డియర్ కామ్రేడ్’ నుండి మొదలై ‘వరల్డ్ ఫేమస్ లవర్’, భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’, ఆ తర్వాత ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాఅవి ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. కింగ్‌డమ్ డిజాస్టర్ విజయ్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపించింది. టాలీవుడ్ టైర్-2 హీరోల రేసులో విజయ్ వెనకబడుతున్నారనే చర్చ ఫిలిం నగర్‌లో మొదలైంది.

Also Read : PEDDI : ‘పెద్ది’లో బాలయ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్?

వరుస పరాజయాలు ఎదురవుతున్నా విజయ్ దేవరకొండ మీద నమ్మకంతో నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రాజ్ కిరణ్ కోలా దర్శకత్వంలో  విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన్  అనే కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. తన పాత మిత్రుడు ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో కలిసి విజయ్ రణబాలి అనే చిత్రాన్ని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న ఈ సినిమాలపై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా హాయ్ నాన్న సినిమాతో తన టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు విజయ్ కు ఎంతో కీలకం. టైర్-2 రేసులో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలంటే ఈ సినిమాల్లో కనీసం ఒకటి రెండు చిత్రాలు భారీ వసూళ్లు సాధించాల్సిందే.

Exit mobile version