రీసెంట్ గా 69వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకంగా 10 జాతీయ పురస్కారాలు లభించాయి. అందులోను మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాల లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది అదేవిధంగా మైత్రి వారి నిర్మాణంలో వచ్చిన పుష్ప సినిమా కు గాను ఏకంగా రెండు అవార్డులు రావడం జరిగింది.పుష్ప సినిమా కు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఎంతో గొప్ప విషయం.68 ఏళ్ల సినీ చరిత్రలో ఏ తెలుగు హీరోకు అలాంటి గౌరవం దక్క లేదు.. ఇకపోతే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా నేడు విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా ప్రమోషన్ల లో భాగంగా విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరు అయిన రవిశంకర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కు జాతీయ అవార్డుల గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. పుష్ప సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడిగా అల్లుఅర్జున్ ఎంపిక కావడం గొప్ప విషయం.పుష్ప సినిమాకు గానుఅల్లు అర్జున్ గారికి, అలాగే దేవిశ్రీ గారికి అవార్డు రావడం ఎంతో సంతోషంగా వుంది.అయితే ఈ అవార్డు సుకుమార్ గారికి కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది.ఉత్తమ డైరెక్టర్ గా సుకుమార్ గారికి జాతీయ అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు.. జాతీయ అవార్డు రావాలి అంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు బహుశా ఆ కాల్క్యూలేషన్స్ లో మిస్ అయ్యి ఉండవచ్చు కానీ పుష్ప 2 సినిమాకు కచ్చితంగా సుకుమార్ గారికి కూడా ఈ అవార్డు వస్తుందని నిర్మాత రవిశంకర్ తెలిపారు.