NTV Telugu Site icon

Vijay Devarakonda : అనిరుధ్ ని కిడ్నాప్ చేసి అయినా నా సినిమాకు తీసుకోవాలని ఉంది.

Whatsapp Image 2023 08 23 At 11.26.24 Am

Whatsapp Image 2023 08 23 At 11.26.24 Am

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తాజాగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని వై రవిశంకర్‌ ఎలమంచిలి కలిసి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు..ఈ సినిమా ను శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ప్రతి ఒక్క పాట ట్రెండింగ్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో యూత్ కోరుకునే అన్ని అంశాలు ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.విడుదల సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.ఖుషి సినిమాను తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ద్వారా శ్రీ లక్ష్మీ మూవీస్‌ సంస్థ అధినేత ఎన్‌వీ ప్రసాద్‌ కేరళలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ అయిన ముఖేష్‌ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్‌బీ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత ఎంవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్‌ సంస్థ నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలు ఘన విజయం సాధించాయి అని తెలియజేశారు.. ఖుషి చిత్రానికి తమిళనాడులో మంచి ఆదరణ లభిస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేసారు.విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ తనని చిత్ర పరిశ్రమలో ఎంతగానో ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలియజేసాడు. అలాగే ఖుషీ చిత్రం కూడా మీ అందరికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు.. సమంతతో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ అని విజయ్ తెలియజేసాడు.విజయ్ దేవరకొండ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.తమిళం మరియు తెలుగు చిత్రాలతో పాటు జాతీయస్థాయిలో పేరు పొందిన సంగీత దర్శకుడు అనిరుద్‌ అని విజయ్ పేర్కొన్నారు. ఆయనని కిడ్నాప్‌ చేసి అయినా సరే నా సినిమాకు తీసుకుపోవాలనిపిస్తుంది. అని అన్నారు.. అనిరుధ్‌ సంగీత దర్శకత్వంలో నేను ఒక చిత్రం చేయాల్సి ఉంది కానీ అది మిస్‌ అయిందని, త్వరలోనే మేము కలిసి పనిచేస్తామని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. దీంతో విజయ్ చేసిన కామెంట్స్‌ సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ గా మారాయి.