NTV Telugu Site icon

Vijay – Ajith : తొమ్మిది ఏళ్ల తర్వాత సంక్రాతి బరిలో స్టార్ హీరోలు.. ఎవరు గెలుస్తారో మరి?

Vijay Ajith

Vijay Ajith

Vijay – Ajith : కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్, అజిత్ లు తొమ్మిదేళ్ల తర్వాత సంక్రాంతి బరిలో దిగుతున్నారు. మరి ఈ పోరులో ప్రేక్షకులు, వారి అభిమానులు తమ హీరో సినిమాలను ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. దళపతి విజయ్ నటించిన వారీసు సినిమా జనవరి 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తొలిసారి హీరో విజయ్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారీసు(తెలుగులో వారసుడు)ఆడియో ఫంక్షన్‌ను భారీస్థాయిలో నిర్వహించేందుకు చిత్ర మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24 సాయంత్రం 4 గంటలకు చెన్నైలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు వెంకటేశ్వర క్రియేషన్స్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది. గ్రాండ్‌గా జరగనున్న ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు ఉంటాయని సమాచారం. కానీ ఈ ఈవెంట్ ను టీవీ చానళ్లు లైవ్ ప్రసారం చేయకపోవడం మాత్రం విజయ్ అభిమానులకు కొంత నిరాశనే కలిగిస్తోంది.

Read Also: RRR Movie: తగ్గని ట్రిపుల్ఆర్ క్రేజ్.. జపాన్ బెస్ట్ చిత్రాల జాబితాలో చోటు

కొత్త సంవత్సరం తొలిరోజున న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్ గా సన్ టీవీలో ప్రసారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. వారీసు సినిమా కోసం బాగానే ప్రచారం చేస్తున్నారు చిత్రయూనిట్. ఇది ఇలా ఉంటే, బాక్సాఫీస్ వద్ద అజిత్ కుమార్ నటించిన ‘తునివు’ చిత్రంతో వారిసు సినిమా ఢీకొట్టనుంది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు స్టార్స్‌ సినిమాలు సంక్రాంతికి పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్, విజయ్ ఫ్యాన్స్ నడుమ ఫైట్ నడుస్తోంది. ‘నా ఫ్రెండ్ సినిమా, నా సినిమా రెండూ బాగా ఆడాలి’ అని విజయ్ పేర్కొన్నట్లుగా న్యూస్ వెలువడింది. ఇక ‘వారిసు’ చిత్రానికి థమన్ ఎస్ మ్యూజిక్ అందించగా… ఇటీవలే మదర్ సెంటిమెంట్‌తో కూడిన పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అజిత్ ‘తునివు’ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘చిల్లా చిల్లా’ సాంగ్ నెట్టింట్ తెగ వైరల్‌ అయిపోయింది. ఇక ‘తునివు’ మూవీ తెలుగులో ‘తెగింపు’ పేరుతో సంక్రాంతికే విడుదలవనుంది.

Show comments