Site icon NTV Telugu

Vignesh: అప్పుడు చెప్పులతో 1000 రూపాయలతో వచ్చా.. కానీ ఇప్పుడు.. ఎమోషనల్ పోస్ట్..

Vignesh

Vignesh

దర్శకుడి విగ్నేష్ శివన్, నయనతార భర్త ప్రస్తుతం తమిళ సినిమాలలో దర్శకుడిగా వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. అంతేకాదు నిర్మాతగా కుడా కొన్ని సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక మరోవైపు విగ్నేష్ శివన్ నిజ జీవితంలో నయనతారతో ప్రేమ, పెళ్లి, పిల్లలతో లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఈయన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన కురుతుంబ ఫోటోలు, వీడియోలు అలాగే ఆయన సంబంధించిన సినిమాల గురించి కూడా చాలా పోస్ట్ చేస్తూ ఉంటాడు.

Drug Peddler Arrested: హైదరాబాద్‌లో డ్రగ్ ముఠా ప్రధాన సూత్రధారి అరెస్ట్

ఇకపోతే ప్రస్తుతం విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం హాంకాంగ్ లో ఉన్న ‘డిస్నీలాండ్’ కి తన భార్య పిల్లలతో వెకేషన్ కి వెళ్ళాడు. డిస్నీలాండ్ ఎంట్రీ వద్ద తన ఫ్యామిలీతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఈ పోస్టుకు ” తాను 12 ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చానని., చెప్పులు వేసుకొని, జేబులో కేవలం రూ. 1000 తో ‘పోడా పొడి’ షూటింగ్ కి ఇక్కడ పర్మిషన్ అడగడానికి వచ్చానని.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తానిప్పుడు నా భార్య, పిల్లలతో ఫ్యామిలీగా వచ్చానంటూ చాలా ఎమోషనల్ గా ఎంతో సంతృప్తికరంగా ఉందని ఎమోషనల్ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Exit mobile version