Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

Director Vignesh Shivan

Director Vignesh Shivan

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తన ప్రతి సినిమాకు అనిరుధ్ ఒక బలమైన స్తంభంలా నిలబడుతున్నాడని, ఈ సినిమాకు కూడా ఆయన అందించిన మ్యూజిక్ ప్రాణం పోసిందని తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు మ్యూజికల్ గా పెద్ద హిట్స్ కావడంతో ‘LIK’ ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను ముందుగానే చూశారట. అనిల్ రావిపూడి సినిమా చూసి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని, ఆయన ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ తర్వాతే తనకు సినిమా విజయంపై పూర్తి నమ్మకం కలిగిందని విఘ్నేష్ శివన్ వెల్లడించారు. ఒక కమర్షియల్ డైరెక్టర్ నుండి వచ్చిన ప్రశంసలు తమ టీమ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఆయన పేర్కొన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకోవడం ఖాయమని చిత్రబృందం ధీమాగా ఉంది.