Site icon NTV Telugu

Vidya Balan: విద్యాబాలన్ పేరుతో ఫేక్ అకౌంట్.. పోలీసులను ఆశ్రయించిన నటి..

Vidyaa Baalan

Vidyaa Baalan

సినీ సెలెబ్రేటిల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడమో, ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది.. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ పేరుతో నకిలీ అకౌంట్ ను క్రియేట్ చేశారని ఆమె పోలీసులను ఆశ్రయించింది..ఆమె పేరుతో జరుగుతోన్న మోసాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. విద్యాబాలన్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్‌ చేసి కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ దారుణం ఇప్పుడు వెలుగులోకి రావడంతో విద్యాబాలన్ పపోలీసులను ఆశ్రయించింది. చాలా రోజులుగా జరుగుతున్న మోసం గురించి నటికి ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్. ఈ నేపథ్యంలోనే ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన దుండగులు ప్రజలను మోసం మోసం చెయ్యనున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది..

సినీ పరిశ్రమలోని ప్రముఖులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా విద్యాబాలన్ పేరుతో మోసం జరుగుతోందని ఓ కాస్ట్యూమ్ డిజైనర్‌కు తెలిసింది. ఆ విషయాన్ని నటికి తెలిజేశారు. వెంటనే అప్రమతమైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. భూల్ భూలయ్య 3′ చిత్రానికి సంతకం చేసింది.. 2007లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భూల్ భూలయ్య’లో ప్రధాన పాత్ర పోషించిన విద్య సీక్వెల్ లో మాత్రం మిస్ అయ్యింది..

Exit mobile version