NTV Telugu Site icon

Elephant Attack: జరైతే ప్రాణాలు పోయేవే.. టూరిస్టుల వాహనాన్ని ఎత్తిపారేసిన ఏనుగు.. వైరల్ వీడియో..

Elephant Attack

Elephant Attack

Elephant Attack: చాలా మందికి అడవుల్లో సఫారీకి వెళ్లాలని ఆశ ఉంటుంది. దగ్గర నుంచి వన్యప్రాణులను చూడాలని అనుకుంటారు. ఇలాంటి వారికి ఆఫ్రికా దేశాలు స్వర్గధామంగా ఉంటాయి. జంతువులను చూస్తున్నంత సేపు సరదాగా ఉంటుంది, కానీ ఒకసారి అవి ఎదురుతిరిగితే ప్రాణాలు పోయేంత పనవుతుంది. ఇక ఏనుగు వంటి భారీ జంతువు పర్యాటకులకు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా 22 సీటర్ సఫారీ ట్రక్కులో పర్యాటకులు ఉండగా.. ఓ భారీ ఎనుగు అమాంతం ట్రక్కును ఎత్తిపారేసింది. ఒక్కసారిగా అందులోని టూరిస్టులు చనిపోతామని భయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Read Also: PM Modi Bhutan Visit: ప్రధాని నరేంద్రమోడీకి భూటాన్ అత్యున్నత పురస్కారం.. “ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో” ప్రధానం..

ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో సోమవారం ఈ అనూహ్య ఘటన జరిగింది. ఏనుగును ట్రక్కును అమాతం నేల నుంచి కొన్ని అడుగుల మేర ఎత్తింది. ఈ క్లిప్‌ని హెండ్రీ బ్లోమ్ అనే వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఈ సమయంలో ఖచ్చితంగా భయపడ్డాము. ట్రక్కులోని వ్యక్తులు చనిపోతారని భావించానని అతను ఏబీసీ న్యూస్‌కి వెళ్లడించారు. ఆ సమయంలో ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు దాక్కునేందుకు ప్రయత్నించారని టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. ఆ సమయంలో ఏనుగు చాలా దూకుడుగా ఉందని చెప్పారు. అయితే, టూర్ గైడ్ పరిస్థితిని హ్యాండిల్ చేసిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పార్క్ అధికారులు తెలిపారు.