NTV Telugu Site icon

Viral Video: బహిరంగ ర్యాలీలో మహిళా నాయకురాలిని ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే?

Shivsena Mla

Shivsena Mla

Viral Video: శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నాయకురాలిని ముద్దుపెట్టుకోవడం వివాదాస్పదమైంది. శివసేన నాయకురాలు శీతల్ మ్హత్రేను సర్వే ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాష్‌ సర్వే చిక్కుల్లో పడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ర్యాలీకి శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, పార్టీ అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్‌ వాహనం మీద ఉన్నారు. ఆయన పక్కనే షీతల్‌ నిలబడి ఉ‍న్నారు. ఉన్న​ట్టుండి ఎమ్మెల్యే రెండుసార్లు కిందకు వంగి మహిళా నేతను ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియో ద్వారా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నకిలీదని తేల్చారు. ఇద్దరు శివసేన నాయకుల ముద్దుల వైరల్ వీడియో నకిలీదని, ఎమ్మెల్యే పరువు తీసేందుకు, అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీడియో మార్ఫింగ్ చేయబడిందని సర్వే కుటుంబం ఆరోపించింది. ఈ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సర్వే కుటుంబం ద్వారా కేసు కూడా నమోదు చేయబడింది. ఇద్దరు శివసేన నేతలు కెమెరాలో ముద్దుపెట్టుకుంటున్న వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 354,509,500,34, 67 కింద దహిసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులు 26 ఏళ్ల మానస్ కువార్, 45 ఏళ్ల అశోక్ మిశ్రాను అరెస్టు చేశారు.

Read Also: Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి

అంతే కాకుండా ఈ వీడియో వ్యవహారంపై శివసేన అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు బాధ్యులైన వ్యక్తులపై విరుచుకుపడ్డారు. ఆమె వ్యక్తిత్వాన్ని అవమానించారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో “రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా? ఇదేనా మీ సంస్కృతి? మాతోశ్రీ అనే ఫేస్‌బుక్‌ పేజీ నుంచి మార్ఫింగ్ చేసిన వీడియోని అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో మీకు బాలాసాహెబ్ సంస్కారం గుర్తుకు రాలేదా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.