పాములు పేరు వింటేనే చాలా మందికి వణుకు పుడుతుంది.. ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే చాలు ఆంత దూరంకు పారిపోతారు.. అత్యంత విషపూరితం, భయపెట్టే జీవులలో పాము ఒకటి. వీటిలో కొన్ని ప్రాణాంతక విష సర్పాలు కూడా ఉన్నాయి. పాము విషం కొద్ది మొత్తంలో కూడా మరణానికి కారణమవుతుంది. అయితే, కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకోవటం ఇటీవల సోషల్ మీడియా ద్వారా అనేకం చూస్తున్నాం. ఇంటర్నెట్‌లో పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి చుట్టూ పాములు అల్లుకుని కనిపిస్తున్నాయి. అదులో చాలా రకాల పాములు పెద్దవి, చిన్నవి అనేకం ఉన్నాయి. అవన్ని ఆ చిన్నారిని హత్తుకుని నిద్రపోతున్నట్టుగా వీడియోలో కనిపిస్తున్నాయి.. ఆ పాములు కూడా ఆ పాపను హత్తుకొని మాములుగానే పడుకున్నాయి..ఆ చిన్నారి చిచ్చరపిడుగు హాయిగా నిద్రపోతుంది. ఇది చూస్తున్న జనాలకు గుండె ఆగిపోయినంత పనైంది. ఇదేదో పీడకలేమో అనిపించేలా ఉంది. కానీ, ఈ అమ్మాయి రోజు ఇలానే పడుకుంటుందని తెలుస్తుంది..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అరియానా అనే అమ్మాయికి పాములంటే చాలా ఇష్టం. ఆమె వివిధ రకాల పాములతో స్నేహం చేసే అనేక వీడియోలను ఇంటర్ నెట్ లో పోస్ట్ చేస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన వారంతా కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..అలా భయంలేకుండా వాటితో ఆడుకోవటం ప్రమాదం అంటూ కొందరు సూచించారు.. ఈ పిల్ల ధైర్యం ఏంటి సామి ఇలా పడుకుంది అంటూ రకరకాల కామెంట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు..